dera baba: 2009 నుంచి నా భార్య డేరాబాబాకు భార్యలా ఉంది: హనీ ప్రీత్ మాజీ భర్త విశ్వాస్ గుప్తా

  • 1999లో హనీ ప్రీత్ తో నా వివాహం జరిగింది
  • 2009 నుంచి డేరా బాబాకు భార్యలా ఉంది
  • 2011లో విడాకులకు దరఖాస్తు చేసుకున్నాను
  • డేరా బాబా, హనీప్రీత్ ఇద్దరూ మా కుటుంబాన్ని బెదిరించేవారు
  • హనీ ప్రీత్ డేరా బాబా దత్త పుత్రిక కాదు
  • హనీప్రీత్ తో డేరా బాబా గడపడం నేను కళ్లారా చూశాను



2009 నుంచి హనీప్రీత్ ఇన్సాన్ డేరా బాబా గుర్మీత్‌ రాం రహీం సింగ్‌ కు భార్యలా వ్యవహరించిందని ఆమె మాజీ భర్త విశ్వాస్ గుప్తా తెలిపాడు. సిర్సాలోని డేరాసచ్ఛాసౌదా ఆశ్రమంతో పాటు, హనీ ప్రీత్ కోసం గుర్మీత్ సొంత గ్రామంలో తనిఖీలు నిర్వహించిన సందర్భంగా తనను సంప్రదించిన మీడియాతో ఆయన మాట్లాడుతూ, 1999లో హనీ ప్రీత్ తో తన వివాహం జరిగిందని విశ్వాస్ గుప్తా తెలిపారు.

 2011లో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నానని ఆయన తెలిపారు. హనీప్రీత్ డేరాబాబా దత్త పుత్రిక కాదని, ఆమె అతనితో గడుపుతుండగా తాను చూశానని ఆయన తెలిపారు. అందుకే తనను చంపేస్తామని చాలా సార్లు బెదిరించారని ఆయన అన్నారు. డేరాబాబా తన నివాస ప్రాంగణంలోని రహస్య గుహలాంటి చోట ‘బిగ్‌ బాస్‌’ తరహా కార్యక్రమం నిర్వహించేవాడని ఆయన తెలిపారు. అందులో పాల్గొనేందుకు కేవలం జంటలను మాత్రమే ఎంపిక చేసేవాడని ఆయన చెప్పారు. ఆరు జంటలతో 28 రోజుల పాటు ఈ కార్యక్రమం జరిగేదని ఆయన తెలిపారు. 

dera baba
gurmeet ram raheem singh
hanipreet
viswas gupta
  • Loading...

More Telugu News