murder: లేడీ బాస్ ను గొంతు కోసి హతమార్చాడు.. కారణం తెలిసి నివ్వెరపోయిన పోలీసులు!

  • శృంగారం కోసం యువకుడిని వేధించిన యజమానురాలు 
  • హెచ్చరించినా వేధింపులు ఆపని లేడీ బాస్ 
  • ఆమెను అంతమొందిస్తే కానీ వేధింపులు ఆగవని భావించిన యువకుడు 
  • టీవీ చూస్తుండగా గొంతు కోసి హతమార్చానన్న యువకుడు

తన యజమానురాలిని హతమార్చిన టీనేజర్ (16) నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి తాను పనిచేసే ఇంటి యజమానురాలిని హతమార్చానని ఏడ్చుకుంటూ చెప్పాడు. పోలీసులు తెలిపిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... ఢిల్లీలోని లజపత్ నగర్ సంగం అపార్ట్ మెంట్ లోని ఒక నివాసంలో నిందితుడు పని చేస్తున్నాడు. అయితే ఆ ఇంటి యజమానురాలు శృంగారం కోసం తనను వేధించేదని తెలిపాడు. చాలా కాలంగా ఇలా ఒత్తిడి చేస్తోందని, దీంతో విసిగిపోయిన తాను.. మరోసారి ఒత్తిడి చేస్తే చంపేస్తానని కూడా హెచ్చరించానని తెలిపాడు.

అయినా ఆమె తీరులో మార్పు రాకపోవడంతో ఆమెను అంతమొందిస్తే తప్ప వేధింపులు ఆగవని భావించిన తాను... ఆమె టీవీ చూస్తున్న సమయంలో వెనుక నుంచి వెళ్లి, గొంతు కోసి, హతమార్చినట్టు తెలిపాడు. అనంతరం నేరుగా సాహిబాబాద్ పోలీస్ స్టేషన్ కు ఏడ్చుకుంటూ వచ్చి జరిగినదంతా చెప్పడంతో పోలీసులు నివ్వెరపోయారు. అనంతరం అతనిపై కేసు నమోదు చేసి, రిమాండ్ కు పంపించామని పోలీసులు తెలిపారు. 

murder
owner murder
delhi
lajapat nagar
  • Loading...

More Telugu News