reliance: జియో అభిమానులకు శుభవార్త.. రేపటి నుంచే ఫోన్ల డెలివరీ!
- తొలుత గ్రామీణ ప్రాంతాలకు సరఫరా
- 15 రోజుల్లో పంపిణీ పూర్తి
- మొత్తం 60 లక్షల ఫోన్ల డెలివరీ
- విశ్వసనీయ వర్గాల సమాచారం
రిలయన్స్ జియో 4జీ ఫీచర్ ఫోన్ బుక్ చేసుకున్న వారికి శుభవార్త. వాయిదా పడుతూ వస్తున్న ఫోన్ల డెలివరీ రేపటి (ఆదివారం) నుంచి ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. 15 రోజుల్లో 60 లక్షల ఫోన్లను డెలివరీ చేసేందుకు రిలయన్స్ ప్రణాళిక సిద్ధం చేసినట్టు సమాచారం. తొలుత గ్రామీణ ప్రాంతాల వారికి ఈ ఫోన్లు పంపిణీ చేసిన తర్వాత పట్టణాలకు సరఫరా చేయాలని భావిస్తున్నట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ విషయమై జియో నుంచి ఇప్పటి వరకు ఎటువంటి అధికార ప్రకటన రాలేదు.
జియో ఫీచర్ ఫోన్‌ను ఉచితంగా అందించనున్నట్టు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ప్రకటించారు. అయితే ఫోన్లు దుర్వినియోగం కాకుండా ఉండేందుకు తొలుత రూ.1500 సెక్యూరిటీ డిపాజిట్‌గా వసూలు చేయనున్నట్టు తెలిపారు. మూడేళ్ల తర్వాత ఆ సొమ్మును తిరిగి ఇచ్చేస్తారు. గత నెల 24న ఈ ఫోన్ల బుకింగ్స్ ప్రారంభం కాగా 60 లక్షల మంది బుక్ చేసుకున్నారు. బుకింగ్ సందర్భంగా రూ.500 చెల్లించారు. డెలివరీ సమయంలో మిగతా రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది.