స్టాక్ మార్కెట్లు: భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు!
- 448 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 157 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- కొంపముంచిన యుద్ధ భయం
ఉత్తరకొరియా దుందుడుకు చర్యలతో యుద్ధ భయం పట్టుకున్న నేపథ్యంలో స్టాక్‌మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. ఈ రోజు సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా పడిపోయింది. మరోవైపు నిఫ్టీ 10 వేల మైలురాయి నుంచి కిందకు దిగింది. ఈ రోజు మార్కెట్ ముగిసే సమయానికి 448 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ 31,922 వద్ద ముగియగా, నిఫ్టీ 157 పాయింట్లు కోల్పోయి 9,964 వద్ద ముగిసింది. ఇక డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 64.78గా కొనసాగుతోంది.
టాప్ గెయినర్స్:
హెచ్‌సీఎల్ టెక్నాలజీస్
విప్రో
భారతీ ఇన్ఫ్రాటెల్
టాటామోటార్స్
లూజర్స్:
హిందాల్కో
టాటాస్టీల్
యస్ బ్యాంక్
ఆల్ట్రాటెక్ సిమెంట్
వేదాంతా లిమిటెడ్