us travel ban: ఎల్లుండితో ముగియనున్న ట్రంప్ ట్రావెల్ బ్యాన్.. ఆరు దేశాలకు ఊరట లభించేనా?

  • ఆదివారంతో ముగియనున్న ట్రావెల్ బ్యాన్
  • ఆరు దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించిన ట్రంప్
  • మళ్లీ పొడిగించే అవకాశం

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించిన వెంటనే డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న సంచలన నిర్ణయం ట్రావెల్ బ్యాన్. మొత్తం ఆరు దేశాలపై ఆయన నిషేధాన్ని విధించారు. ట్రంప్ నిర్ణయంతో ఇరాన్, సిరియా, లిబియా, సోమాలియా, సూడాన్, యెమెన్ దేశాల ప్రజలపై ట్రావెల్ బ్యాన్ అమల్లోకి వచ్చింది. ఈ బ్యాన్ ఆదివారంతో ముగియనుంది. అయితే ఈ దేశాల ప్రజలను మళ్లీ అమెరికాలోకి రానిస్తారా? లేదా? అనే విషయంలో సందిగ్ధత నెలకొంది.

ఈ దేశాలకు చెందిన వారు అమెరికాకు వెళ్లాలంటే అమెరికా దౌత్యకార్యాలయ ప్రతినిధులు వీసాలు మంజూరు చేయాల్సి ఉంటుంది. ఈ విషయంపై ఇంతవరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. మరోవైపు, ఈ ట్రావెల్ బ్యాన్ ను పొడిగించేందుకు ట్రంప్ సర్కారు సిద్ధమవుతోందంటూ కథనాలు కూడా వినిపిస్తున్నాయి. మరో  90 రోజుల వరకు (ట్రావెల్ బ్యాన్ పై సుప్రీంకోర్టులో విచారణ వచ్చేంత వరకు) నిషేధాన్ని పొడిగించాలని భావిస్తున్నారట.

us travel ban
extension of us travel ban
donald trump
us
  • Loading...

More Telugu News