akhilesh yadav: అఖిలేష్ కుంగుబాటుతో బాధపడుతున్నారు: యూపీ డిప్యూటీ సీఎం

  • డేరా బాబాతో బీజేపీ నేతలకు సంబంధాలు లేవు
  • అఖిలేష్ చేసినవి తప్పుడు ఆరోపణలు
  • యూపీ అభివృద్ధి కోసం బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోంది

యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ సింగ్ యాదవ్ కుంగుబాటుతో బాధపడుతున్నారని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య అన్నారు. తాజాగా అఖిలేష్ మాట్లాడుతూ డేరా బాబా గుర్మీత్ సింగ్ రామ్ రహీంతో బీజేపీ నేతలకు సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. ఈ సందర్బంగా డేరా బాబాతో కలసి వున్న పలువురు బీజేపీ నేతల ఫొటోలను ప్రస్తావించారు.

ఈ నేపథ్యంలో, అఖిలేష్ పై కేశవ్ ప్రసాద్ మండిపడ్డారు. అఖిలేష్ డిప్రెషన్ కు గురయ్యారని...అందుకే బీజేపీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. గుర్మీత్ తో బీజేపీ నేతలకు సంబంధాలు లేవని చెప్పారు. యూపీ అభివృద్ధి కోసం బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. తొలి ఆరు నెలల యోగి ప్రభుత్వంలో వీఐపీ సంస్కృతికి చరమగీతం పాడామని చెప్పారు.

akhilesh yadav
samjwadi party
keshav prasad mourya
bjp
gurmeeth singh ram rahim
  • Loading...

More Telugu News