actress anjali: హీరోయిన్ అంజలి బోయ్ ఫ్రెండ్ పై డ్రంకెన్ డ్రైవ్ కేసు... అరెస్ట్

  • కొత్త సినిమా టీమ్ తో పార్టీ
  • స్వయంగా కారు నడుపుతూ ఇంటికి బయల్దేరిన జై
  • డివైడర్ ను ఢీకొన్న కారు
  • అరెస్ట్, బెయిల్ పై విడుదల

టాలీవుడ్, కోలీవుడ్ లలో బిజీగా ఉన్న తెలుగమ్మాయి అంజలి. గతి కొద్ది కాలంగా తమిళ హీరో జైతో అంజలి ప్రేమాయణంలో ఉంది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇదంతా పక్కనపెడితే... డ్రంకెన్ డ్రైవ్ కేసులో జై పట్టుబడ్డాడు. ప్రస్తుతం వీరిద్దరూ 'బెలూన్' అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో చెన్నైలోని ఓ స్టార్ హోటల్ లో తన కొత్త సినిమా టీమ్ తో కలసి జై పార్టీ చేసుకున్నాడు.

 అనంతరం ఇంద్రానగర్ లోని తన ఇంటికి స్వయంగా కారును నడుపుకుంటూ వెళ్లాడు. అద్యార్ ఫ్లైఓవర్ దగ్గరకు రాగానే మద్యం మత్తులో డివైడర్ కు ఢీకొట్టాడు. ఈ ఘటనలో అతని ఆడీ కారు పూర్తిగా డ్యామేజ్ అయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని, జైని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత స్టేషన్ బెయిల్ పై అతను విడుదలయ్యాడు. గతంలో కూడా మద్యం తాగి కారు నడుపుతూ జై పట్టుబడ్డాడు.

actress anjali
hero jai
hero jai arrest
tollywood
bollywood
  • Loading...

More Telugu News