petrol rates: ఈ యాప్ వాడితే పెట్రోల్, డీజిల్ పై డిస్కౌంట్ లభిస్తుంది!

  • భీమ్ యాప్ వాడితే డిస్కౌంట్
  • అధికారికంగా ప్రకటించిన కేంద్రం
  • పెట్రోల్ పై 49 పైసలు
  • డీజిల్ పై 41 పైసలు

రోజువారీ ధరల సమీక్ష విధానం అమల్లోకి వచ్చిన తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు కొండెక్కుతున్న సంగతి తెలిసిందే. దేశీయ పన్నులు, అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరల కారణంగా వీటి ధరలు పెరుగుతున్నాయి. అయితే, వాహనదారులకు కొంత ఊరట కలిగించే వార్తను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్రం లాంచ్ చేసిన భీమ్ యాప్ ను ఇంధన చెల్లింపులకు వాడితే, లీటర్ పెట్రోల్ పై 49 పైసలు, లీటర్ డీజిల్ పై 41 పైసల డిస్కౌంట్ లభిస్తుందని తెలిపింది. డిజిటల్ ఇండియా అధికారిక అకౌంట్ ఈ ప్రకటనను జారీ చేసింది. 

petrol rates
diesel rates
bhim app
discount for petrol and diesel
  • Loading...

More Telugu News