మమతా బెనర్జీ: హింస జరిగితే బాధ్యత నాది కాదు: కోర్టు తీర్పుపై మమతా బెనర్జీ మండిపాటు


ఇటీవ‌లే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మ‌మ‌తా బెనర్జీ త‌మ రాష్ట్రంలో మొహర్రం రోజున (సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 1 వ‌ర‌కు) దుర్గా దేవి విగ్రహాలను నిమజ్జనం చేయకూడ‌ద‌ని ఆదేశాలు జారీ చేశారు. అయితే, మమతా బెన‌ర్జీ ఇచ్చిన ఆదేశాలకు వ్య‌తిరేకంగా ప‌లువురు పిటిష‌న్ వేయ‌గా ఆ రాష్ట్ర‌ హైకోర్టు స్పందిస్తూ, ఆమె ఇచ్చిన ఆదేశాల‌ను కొట్టిపారేసింది.

ఏ కారణం లేకుండానే మ‌మ‌తా బెనర్జీ త‌న‌ అధికారాలను వాడుతున్నారని కోర్టు పేర్కొంది. కోర్టు తీర్పుపై స్పందించిన మ‌మ‌తా బెన‌ర్జీ.. మొహర్రం సందర్భంగా దుర్గా మాత విగ్రహాల నిమజ్జనం సందర్భంలో ఒకవేళ హింస జరిగితే ఆ బాధ్యత తనది కాదని వ్యాఖ్యానించారు. అంతేగాక‌, తాను ఎప్పుడు ఏం చేయాలో ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు.   

  • Loading...

More Telugu News