కోల్ కతా వన్డే: కోల్ కతా వన్డే: ఆరు వికెట్లు కోల్పోయిన టీమిండియా
కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతోన్న రెండో వన్డే మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తోన్న టీమిండియా ఆరు వికెట్లు కోల్పోయింది. ధాటిగా ఆడిన కెప్టెన్ విరాట్ కోహ్లీ 92 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. అనంతరం కొద్ది సేపటికే ధోనీ 5 పరుగుల వ్యక్తిగత స్కోరుకే వెనుదిరిగాడు. టీమిండియా ఓపెనర్లు అజింక్యా రహానే 55 (రనౌట్), రోహిత్ శర్మ 7, మనీష్ పాండే 3, కేదర్ జాదవ్ 24 పరుగులు చేశారు. ప్రస్తుతం క్రీజులో హార్థిక్ పాండ్యా 7, భువనేశ్వర్ కుమార్ 2 పరుగులతో ఉన్నారు. టీమిండియా స్కోరు 207/6 (40 ఓవర్లకి) గా ఉంది. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ కౌల్టర్ నైల్ 3 వికెట్లు తీయగా, రిచర్డ్ సన్, అగర్ ఒక్కో వికెట్ వికెట్ తీశారు.