secendrabad: సికింద్రాబాదు రైల్వే స్టేషన్ లో ప్లాట్ ఫాం టికెట్ ధర రెట్టింపు!

  • సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఫ్లాట్ ఫాం టికెట్ ధర పెంపు
  • 100 శాతం ధరను పెంచిన దక్షిణ మధ్య రైల్వే
  • ఇంతవరకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్లాట్ ఫాం టికెట్ ధర 10 రూపాయలు
  • నేటి నుంచి 20 రూపాయలు
  • ధర పెంపుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు

కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులను ప్రయాణానికి పంపిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో వీడ్కోలు పలికాలని భావిస్తున్నారా? అయితే ఇకపై మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిందే. ఎందుకంటే, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫాం టికెట్ ధరను పెంచారు. సుమారు 100 శాతం పెంచడం ప్రయాణికులను ఆందోళనకు గురి చేస్తోంది. ఇంత వరకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రవేశించాలంటే ఫ్లాట్ ఫాం టికెట్ 10 రూపాయలుగా ఉండేది. నేటి నుంచి ఈ టికెట్ ధర 20 రూపాయలు కానుంది. ఇప్పటికే ఈ మేరకు దక్షిణమధ్య రైల్వే అధికారుల నుంచి ఉత్తర్వులు జారీ కావడంతో పెంచిన ధర అమలులోకి వచ్చింది. దీనిపై ప్రయాణికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 

secendrabad
secendrabad railway station
platform ticket
  • Loading...

More Telugu News