Kim Jong-un: పోర్న్ వీడియో తీసినందుకు 11 మంది సంగీతకారులను ముక్కలు ముక్కలుగా చేసిన ఉత్తర కొరియా!

  • మృతదేహాలపై నుంచి యుద్ధ ట్యాంకులు నడిపించిన వైనం
  • ఆనవాళ్లు లేకుండా చేసేందుకే..
  • భయానక దృశ్యాన్ని వీక్షించిన 10 వేల మంది
  • దక్షిణ కొరియాకు పారిపోయి వచ్చిన ప్రత్యక్ష సాక్షి కథనం 

ఉత్తర కొరియా డిక్టేటర్ కిమ్ జోంగ్ ఉన్ పాలనలో గతంలో జరిగిన మరో అకృత్యం వెలుగుచూసింది. 11 మంది సంగీతకారులను యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్స్‌ను ఉపయోగించి కాల్చి చంపిన ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి. వారి శరీరాలను ముక్కలు ముక్కలుగా చేసినట్టు సమాచారం. పోర్నోగ్రఫీ చిత్రీకరించినందుకు వారికి బహిరంగంగా ఈ శిక్ష అమలు చేశారు. అంతేకాదు.. మ్యుజీషియన్స్ మృతదేహాలు ఈ భూమిపై మిగలకుండా చేసేందుకు వారిపై నుంచి యుద్ధ ట్యాంకులను నడిపించినట్టు తెలుస్తోంది.

తన తండ్రి మరణానంతరం దక్షిణ కొరియాకు పారిపోయిన 25 ఏళ్ల హీ యాన్ అనే అమ్మాయి ఈ సంఘటనను ఇప్పుడు బయటపెట్టింది. ఆ రోజు ఈ భయానక దృశ్యాన్ని పదివేల మంది చూసినట్టు ఆమె తెలిపింది. ప్యోంగాంగ్‌లోని మిలటరీ అకాడమీలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు చెప్పింది. అప్పుడు క్లాసు రూంలో వున్న తమను.. మ్యుజీషియన్లను కాల్చుతున్న ఘటనను చూడాల్సిందిగా బలవంతం చేశారని, తానైతే 200 అడుగుల దూరం నుంచే చూశానని తెలిపింది. ఈ ఘటన తర్వాత మూడు రోజుల పాటు తన కడుపులో దేవేసిందని, దాంతో తాను ఏమీ తినలేకపోయానని, ప్రతీ క్షణం అదే దృశ్యం గుర్తొచ్చేదని పేర్కొంది. కిమ్ పాలనలోని ఈ అరాచకాన్ని ప్రపంచంలోని ప్రముఖ పత్రికలన్నీ పతాక శీర్షికన ప్రచురించాయి.

Kim Jong-un
anti-aircraft guns
musicians
pornographic video
  • Loading...

More Telugu News