స‌దావ‌ర్తి భూములు: స‌దావ‌ర్తి భూముల వ్య‌వ‌హారంలో రెండో బిడ్డ‌ర్‌కు అవ‌కాశం.. మొద‌టి బిడ్డ‌ర్‌కు నోటీసులు


ఊహించ‌ని మ‌లుపులు తిరుగుతోన్న స‌దావ‌ర్తి భూముల వ్య‌వ‌హారంలో దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ అనురాధ ఈ రోజు సాయంత్రం ఓ ప్ర‌క‌ట‌న చేశారు. ఈ భూముల‌ను వేలం వేయ‌గా కడపకు చెందిన సత్యనారాయణ బిల్డర్స్ యజమానులు వాటిని రూ. 60 కోట్ల 30 లక్షలకు దక్కించుకున్న విష‌యం తెలిసిందే. అయితే, వారు డిఫాల్ట్ కావ‌డంతో రెండో బిడ్డ‌ర్‌కు అవ‌కాశం ఇస్తున్నామ‌ని అనురాధ తెలిపారు. అలాగే మొద‌టి బిడ్డ‌ర్ డిఫాల్ట్ అయినందున ఆయనకు నోటీసులు జారీ చేశామ‌ని చెప్పారు. డ‌బ్బు చెల్లించేందుకు రెండో బిడ్డ‌రుకు 48 గంట‌ల గ‌డువు ఇస్తున్నట్లు తెలిపారు. మొద‌టి బిడ్డ‌ర్ కంటే రెండో బిడ్డ‌ర్ రూ.5 ల‌క్ష‌లు త‌క్కువ కోట్ చేశారు.    

  • Loading...

More Telugu News