బెంగాలీ నటి: బెంగాలీ నటి కాంచనపై తాగుబోతుల దాడి!


గ‌త అర్ధ‌రాత్రి త‌న‌పై ముగ్గురు తాగుబోతులు దాడి చేశార‌ని వివ‌రిస్తూ బెంగాలీ నటి కాంచనా మొయిత్రా పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కోల్‌క‌తాలో షూటింగ్ అయిపోయాక తన కారులో ఇంటికి వెళుతోన్న స‌మ‌యంలో సిరితీ క్రాసింగ్‌ వద్ద ముగ్గురు యువ‌కులు త‌న‌ వాహ‌నాన్ని అడ్డుకున్నార‌ని ఆమె తెలిపారు. ఆ యువ‌కులు బాగా తాగి ఉన్నార‌ని చెప్పారు. త‌న‌ డ్రైవర్‌పై దాడి చేసిన ఆ యువ‌కులు కారు కీస్‌ లాక్కొని, త‌నను కారు నుంచి బయటకు లాగార‌ని చెప్పారు.

త‌న‌ను వారు అసభ్యంగా తాకారని సదరు నటి తెలిపారు. త‌న‌ను వ‌దిలేయాల‌ని వేడుకున్నా వారు విన‌లేద‌ని చెప్పారు. 40 సార్లు సిట్‌-అప్‌లు (గుంజీలు) చేయాలని త‌న‌ను బెదిరించారని చెప్పారు. చివ‌ర‌కు ఎలాగోలా వారి బారినుంచి త‌ప్పించుకున్నాన‌ని తెలిపారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న‌ బెహలా పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి, మూడో వ్య‌క్తి కోసం గాలిస్తున్నారు. 

  • Loading...

More Telugu News