jogi ramesh: చంద్రబాబు చేసేవన్నీ రివర్స్ పనులే: జోగి రమేష్


కృష్ణా నది పక్కన అక్రమంగా కట్టిన భవంతిలో నివసిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు నదుల పరిరక్షణ గురించి మాట్లాడే హక్కు కూడా లేదని వైసీపీ నేత జోగి రమేష్ అన్నారు. సేవ్ రివర్స్ పేరుతో చంద్రబాబు అన్నీ రివర్స్ పనులే చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు జీవితమే అక్రమాలమయమని అన్నారు. టీడీపీలో చేరి, మామ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారని చెప్పారు. ప్రాజెక్టుల్లో సైతం అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. కేవలం కమిషన్ల కోసమే ట్రాన్స్ ట్రాయ్ సంస్థను పక్కన పెట్టేశారని అన్నారు. అమరావతి నిర్మాణాలకు సినీ దర్శకుల సహకారం కావాలా? అని ప్రశ్నించారు. నిర్మాణాలకు సంబంధించి డైరెక్టర్లకు ఏం తెలుస్తుందని... ఇంజినీర్లకైతే అవగాహన ఉంటుందని చెప్పారు. 

jogi ramesh
ysrcp
chandrababu
Telugudesam
jogi ramesh comments on chandrababu
  • Loading...

More Telugu News