dhoni: ధోనీ ఏ రేంజ్ లో ఆడాడో ఎమ్మెస్కే గుర్తుంచుకోవాలి: మరోసారి ప్రశంసలు కురిపించిన మైఖేల్ క్లార్క్

  • ధోనీ ఓ దిగ్గజం
  • 2019లోనే కాదు.. 2023 ప్రపంచకప్ లో కూడా ఆడతాడు
  • ధోనీ ఏ రేంజ్ లో ఆడుతున్నాడో ఎమ్మెస్కే గుర్తుంచుకోవాలి
  • ధోనీ ఫిట్ నెస్ అమోఘం

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ టీమిండియా స్టార్ క్రికెటర్ ధోనీపై మరోసారి ప్రశంసల జల్లు కురిపించాడు. శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ లో 300వ వన్డేను ధోనీ ఆడినప్పుడు కూడా క్లార్క్ అతన్ని ఆకాశానికెత్తేశాడు. తాజాగా మాట్లాడుతూ, ధోనీ ఒక దిగ్గజ ఆటగాడని కితాబిచ్చాడు. 2019 ప్రపంచ కప్ లోనే కాదు... 2023లో జరిగే వరల్డ్ కప్ లో కూడా ధోనీ ఆడతాడని జోస్యం చెప్పాడు. ధోనీకి ఉన్న అద్భుతమైన ఫిట్ నెస్ లెవెల్సే దీనికి కారణమని తెలిపాడు.

లంకతో వన్డే సిరీస్ ఫలితం... ధోనీ నైపుణ్యానికి నిదర్శనమని క్లార్క్ అన్నాడు. వచ్చే వరల్డ్ కప్ లో ధోనీ ఆడతాడో, లేదో ఇప్పుడే చెప్పలేమంటూ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, శ్రీలంక సిరీస్ లో ధోనీ ఏ రేంజ్ లో రాణించాడో గుర్తుంచుకోవాలని చెప్పాడు. ఆసీస్ తో జరిగిన తొలి వన్డేలో భారత్ విజయం సాధించడంలో కూడా ధోనీదే కీలక భూమిక అని చెప్పాడు.

dhoni
ms dhoni
Michael Clarke
team india
clarke praises dhoni
  • Loading...

More Telugu News