kanche ilaiah: 'ఐలయ్యా... నీకు దమాకు లేదా?' అంటున్న వైశ్య యువతుల వీడియో సాంగ్ వైరల్!

  • సెటైరికల్ సాంగ్ విడుదల
  • 'సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు' అన్న ఐలయ్య
  • క్షమాపణలు కోరుతున్న వైశ్య వర్గాలు
  • ససేమిరా అంటున్న కంచె ఐలయ్య

'సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు' అంటూ కంచె ఐలయ్య రాసిన పుస్తకంపై తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర నిరసనలు సాగుతుండగా, కొంతమంది వైశ్య యువతులు 'ఐలయ్యా... నీకు దమాకు లేదా?... లేదు లేదు లేదు' అంటూ పాడిన పాట వీడియో వైరల్ అవుతోంది. ఆయన తీరును నిరసిస్తూ, ఓ సెటైరికల్ సాంగ్ గా ఈ పాట సాగుతోంది. దాదాపు 15 మంది మహిళలు ఈ వీడియోలో పాట పాడుతున్నారు.

తమ మనోభావాలను ఐలయ్య దెబ్బ తీశారని ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ వైశ్య వర్గాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పుస్తకాన్ని నిషేధించాలని, ఐలయ్య బేషరతుగా క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ పాటలో 'వైశ్యాస్ తో పెట్టుకుంటే పోతావు', 'మేము స్మగ్లర్లము కాము', 'గొడవలు పెట్టడానికే ఉన్నావు' అంటూ ఐలయ్యను విమర్శించారు. కాగా, నిన్న ఏపీ డీజీపీ సాంబశివరావు సైతం ఐలయ్యపై కేసు పెట్టాలని పోలీసులను ఆదేశించారు. ఇంత జరుగుతున్నా, తన పుస్తకంలో తప్పేమీ లేదని, తాను వెనక్కి తగ్గబోనని ఐలయ్య వ్యాఖ్యానించడం గమనార్హం. ఐలయ్యపై ఈ సెటైర్ వీడియోను మీరూ చూడవచ్చు.

kanche ilaiah
ap dgp
video song viral
  • Error fetching data: Network response was not ok

More Telugu News