regina: కళ్లతో చూసిందే నమ్మండి.. చెప్పింది వినకండి: రెజీనా

  • సీనీ పరిశ్రమలో ప్రతి అమ్మాయికీ సమస్యలు ఉంటాయి
  • కొంచెం క్లోజ్ గా ఉంటే.. గాసిప్స్ వచ్చేస్తాయి
  • లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నారంటూ ప్రచారం చేస్తారు
  • దేన్నీ పట్టించుకోకపోవడమే మంచిది

సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ప్రతి అమ్మాయికీ సమస్యలు ఉండటం సహజమేనని హీరోయిన్ రెజీనా తెలిపింది. ఒకే హీరోతో రెండు మూడు సినిమాలు చేసినా, లేదా ఎవరితోనైనా కాస్త క్లోజ్ గా కనిపించినా, వెంటనే పుకార్లు పుట్టుకొస్తాయని చెప్పింది. పలానా వ్యక్తితో డేటింగ్ చేస్తోందని, లేదా లివింగ్ రిలేషన్ షిప్ లో ఉదంటూ గాసిప్స్ చక్కర్లు కొడతాయని తెలిపింది.

అయితే, ఇలాంటి గాసిప్స్ ను పట్టించుకోకపోవడమే మంచిదనేది తన అభిప్రాయమని చెప్పింది. తన గురించి ఎవరు ఏమనుకున్నా పట్టించుకోనని తెలిపింది. మీరు చెవులతో విన్నది నమ్మకండని, కళ్లతో చూసింది మాత్రమే నమ్మాలని కోరింది.

regina
tollywood
gossips on regina
regina affair
  • Loading...

More Telugu News