రాజ్ తరుణ్: ‘భయ్యా, అమ్మాయి దొరికిందా? లగ్గం ఎప్పుడు?: సినీ హీరో రాజ్ తరుణ్ కి అభిమాని ప్రశ్న
- ట్విట్టర్ లో తన అభిమానుల ప్రశ్నలకు రాజ్ తరుణ్ సమాధానం
- తాను పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడో చెప్పలేకపోయిన హీరో
- ప్రస్తుతానికి సినిమాల్లో చేసుకునే పెళ్లిళ్లను చూసి సరిపెట్టుకోండని సమాధానం
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే టాలీవుడ్ యువ నటుల్లో రాజ్ తరుణ్ ఒకరు. తన అభిమానులు ట్విట్టర్ లో అడిగే ప్రశ్నలకు ఓపిగ్గా, సరదాగా సమాధానాలు చెబుతూ ఉంటాడు. ఈ రోజు ఆయన ట్విట్టర్‌లో తన అభిమానులతో ముచ్చటించాడు. ఓ అభిమాని ఆయనను మహేశ్ బాబు కొత్త సినిమా స్పైడర్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ కావాలని అడిగాడు. దానికి రాజ్ తరుణ్ స్పందిస్తూ ‘నాకు కూడా కావాలి భయ్యా’ అని రిప్లై ఇచ్చాడు.
తాను సినిమాల్లోకి రాకపోయి ఉంటే వైద్యుడిని లేక రచయితని అయ్యే వాడినని మరో అభిమానికి చెప్పాడు. తనకి ఇష్టమైన క్రికెటర్ ఎవరని ఓ అభిమాని అడిగితే, తనకు కోహ్లీ, ధోనీ, రోహిత్ శర్మ, హార్థిక్ పాండ్యా ఇష్టమని నలుగురి పేర్లు చెప్పాడు. ‘భయ్యా అమ్మాయి దొరికిందా? లగ్గం ఎప్పుడు? నీ పెళ్లి చూడాలని ఎదురుచూస్తున్నాం’ అని ఓ అభిమాని అడిగాడు. దీనికి రాజ్ తరుణ్ సమాధానం ఇస్తూ ‘ప్రస్తుతానికి సినిమాల్లో నేను చేసుకునే పెళ్లిళ్లను చూసి సరిపెట్టుకో భయ్యా’ అని సమాధానం ఇచ్చాడు.