అక్కినేని: హైదరాబాద్ లో ‘అక్కినేని ఆలోచనలు’ పుస్తక అనువాదాల ఆవిష్కరణోత్సవం
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, పద్మవిభూషణ్, నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు 94 వ జయంతి మహోత్సవం సందర్భంగా ఈ నెల 23న ‘అక్కినేని ఆలోచనలు’ (ఏఎన్ఆర్ రాసిన పుస్తకం) పుస్తక అనువాదాల ఆవిష్కరణోత్సవ వేడుక నిర్వహిస్తున్నామని రసమయి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డా.ఎం.కె.రాము తెలిపారు. ఈ వేడుక హైదరాబాద్ నాంపల్లిలోని తెలుగు విశ్వ విద్యాలయంలోని ఎన్టీఆర్ ఆడిటోరియంలో ఆ రోజు సాయంత్రం 6 గంటల నుంచి జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ముఖ్యమంత్రి రోశయ్య హాజరవుతారని చెప్పారు. అలాగే కళాబంధు టి.సుబ్బరామిరెడ్డి కూడా విచ్చేస్తారని తెలిపారు.