china: డోక్లాంలో భంగపడ్డ చైనా.. ఇప్పుడు దొడ్డిదారిని ఎంచుకుంది!


సిక్కిం సరిహద్దుల్లో ఉన్న డోక్లాం ప్రాంతంలో రోడ్డును నిర్మించబోయి... భారత్ ప్రతిఘటనతో చైనా భంగపడిన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా వెనక్కి తగ్గినట్టు కనిపించిన చైనా... ఇప్పుడు మరోసారి తన వంకర బుద్ధిని బయటపెట్టుకుంది. దక్షిణాసియాలోకి చొరబడేందుకు నేపాల్ సరిహద్దులను కలిపే, టిబెట్ లోని జాతీయ రహదారిని పున:ప్రారంభించింది.  టిబెట్ లోని జిగాజే విమానాశ్రయం నుంచి సిటీ సెంటర్ వరకు 40.4 కిలోమీటర్ల పొడవు, 25 మీటర్ల వెడల్పు ఉన్న హైవేని తెరిచినట్టు చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. కేవలం పౌర రవాణా అవసరాల కోసమే ఈ హైవేను పున:ప్రారంభించామని చైనా చెబుతున్నా... దీని వెనుక వ్యూహాత్మక నిర్ణయం ఉందని నిపుణులు చెబుతున్నారు.  

china
china opens new highway
tibet
nepal
  • Loading...

More Telugu News