ట్విట్టర్: ట్విట్టర్ లో నాలుగు మిలియన్లకు చేరిన మహేశ్ బాబు ఫాలోవర్లు!
ట్విట్టర్‌లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న టాలీవుడ్ నటుడు మహేశ్ బాబు తన దూకుడుని కొనసాగిస్తున్నాడు. తాజాగా ఆయన ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య నాలుగు మిలియన్లను దాటేసింది. ట్విట్టర్‌లో అత్యధిక మంది పాలోవర్లు ఉన్నప్పటికీ మహేశ్ బాబు మాత్రం అరుదుగానే ట్వీట్లు చేస్తుంటాడు. తన కుటుంబం, తన సినిమాలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారంపైనే ఆయన స్పందిస్తుంటారు.
ఇటీవల తన సినిమాలోని ఎస్పీవై రయ్ రయ్ రయ్ అనే పాటకు తన కూతురు సితార పెదవులు కదిలించిన వీడియోను షేర్ చేయగా అది వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. తన కొత్త సినిమా స్పైడర్ కు సంబంధించిన ముఖ్యమైన విషయాలను కూడా మహేశ్‌బాబు తన ట్విట్టర్ ఖాతా ద్వారానే తెలిపాడు.