metro corridor: మెట్రో పిల్లర్లకు జీపీఎస్ అనుసంధానంతో నెంబరింగ్... పర్యాటకులను ఆకర్షించే యత్నం
మెట్రో కారిడార్లలోని పిల్లర్లను జీపీఎస్‌తో అనుసంధానిస్తూ నెంబరింగ్ ఇవ్వాలని హైదరాబాద్ మెట్రో రైలు (హెచ్ఎంఆర్) అధికారులు నిర్ణయించుకున్నారు. దీని వల్ల నగరంలోని ఆయా ప్రదేశాలను సులభంగా గుర్తించే సదుపాయం కలగనుంది. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన వారికి ఇలాంటి జీపీఎస్ అనుసంధాన నెంబరింగ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని హెచ్ఎంఆర్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్‌వీస్ రెడ్డి తెలిపారు.
మెట్రో పిల్లర్లకు ఆల్ఫా-న్యూమరిక్ విధానంలో నెంబరింగ్ ఇవ్వనున్నారు. రైలు ప్రారంభ కారిడార్ నుంచి చివరి కారిడార్ వరకు ప్రపంచ ప్రామాణిక సంఖ్యామానం ప్రకారం ఇంగ్లిష్, తెలుగు భాషల్లో బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. మెట్రో స్టేషన్‌కి చుట్టుపక్కల ఉండే ప్రదేశాల వివరాలను కూడా బోర్డుల్లో పొందుపరచనున్నట్లు రెడ్డి చెప్పారు. మూడు కారిడార్లకు కలిపి మొత్తంగా 2,748 పిల్లర్లు ఉన్నాయి. ప్రతి మెట్రో స్టేషన్‌లో గేట్ 1, గేట్ 2, గేట్ 3, గేట్ 4 అని నాలుగు గేట్లు ఉంటాయని ఆయన వివరించారు.