ఇన్ఫోసిస్: రాజీనామాల పరంపర.. ఇన్ఫోసిస్‌కి టాటా చెప్పిన మరో సీనియర్ అధికారి!
కొన్ని రోజులుగా ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్‌కు వరుసగా ఆ కంపెనీ అధికారులు రాజీనామాలు చేస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా మరో సీనియర్ అధికారి రాజీనామా చేశారు. ఇన్ఫోసిస్ సీనియర్ ఉపాధ్యక్షుడు, డిజైన్ అండ్ రిసెర్చ్ హెడ్ సంజయ్ రాజగోపాలన్ రాజీనామా చేయడమే కాకుండా ఇప్పుడు తనకు స్వేచ్ఛ లభించిందని వ్యాఖ్యానించారు. ఆయన ఇన్ఫోసిస్‌లో ఆగస్టు 2014 నుంచి పనిచేస్తున్నారు. ఆ కంపెనీలో చాలా మంది ఉద్యోగులకు శిక్షణను ఇచ్చారు. ఇటీవల ఇన్ఫోసిస్ సీఈవో పదవికి రాజీనామా చేసిన విశాల్ సిక్కానే గతంలో ఈ కంపెనీకి రాజగోపాలన్‌ను పరిచయం చేశారు.