ధోనీ: ఈ సారి ఎయిర్ పోర్టులో పడుకున్న ధోనీ

  • చెన్నై నుంచి కోల్‌క‌తాకు బయలుదేరిన టీమిండియా 
  • ఎయిర్ పోర్టులోనే విశ్రాంతి తీసుకున్న ఆటగాళ్లు
  • ఇటీవలే మైదానంలో పడుకున్న ధోనీ 

ఇటీవ‌ల‌ భారత్‌ - శ్రీలంకల మధ్య మూడో వన్డే మ్యాచ్‌ జరుగుతోన్న‌ సమయంలో మహేంద్ర సింగ్‌ ధోనీ మైదానంలో నిద్రపోయి వార్త‌ల్లో నిలిచిన విష‌యం తెలిసిందే. ఈ సారి ధోనీ ఎయిర్‌పోర్టులో ప‌డుకున్నాడు. నిన్న చెన్నైలో ఆస్ట్రేలియాతో మొద‌టి వ‌న్డే ఆడిన‌ టీమిండియా అద్భుత విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఇక టీమిండియా ముందున్న ల‌క్ష్యం రెండో వ‌న్డేలో గెల‌వ‌డం. కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో రెండో వ‌న్డే జ‌ర‌గ‌నుంది. కోల్‌క‌తాకి వెళ్లే క్ర‌మంలో చెన్నై ఎయిర్‌పోర్టుకి టీమిండియా ఆట‌గాళ్లంతా వ‌చ్చారు.

విమానం కోసం ఎదురు చూస్తూ ఇలా ఎయిర్‌పోర్టు ఫ్లోరులోనే కూర్చుండిపోయారు. టీమిండియా మిగ‌తా ఆట‌గాళ్లంతా ఫ్లోరుపై కూర్చుంటే ధోనీ మాత్రం ప‌డుకున్నాడు. దీనిపై నెటిజ‌న్లు ర‌క‌ర‌కాలుగా కామెంట్లు చేస్తున్నారు. ధోనీ రైల్వే స్టేష‌న్‌లో ఉన్నాడ‌ని అనుకుంటున్నాడేమో అని ఒక‌రు, ధోనీకి నిద్ర‌పోవ‌డం అంటే చాలా ఇష్ట‌మ‌ని మ‌రొక‌రు, ధోనీ హిప్నాటిజం చేస్తూ రిలాక్స్ అవుతాడేమోనని ఇంకొకరు ఇలా ఎవ‌రికి తోచిన‌ట్లు వారు కామెంట్లు పెడుతున్నారు. ఈ ఫొటోల‌ను బీసీసీఐ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసింది.   

  • Loading...

More Telugu News