ntr: అలాగైతే నేను ఇప్పుడు కోమాలో ఉండేవాడినేమో: జూ.ఎన్టీఆర్ చురకలు
- రాక్షసత్వం, ఒంటరితనం, మంచితనం వంటి గుణాలతో ఉండే పాత్రల్లో నటించా
- ఎన్నో పాత్రల్లో నటించే నటుడు కమల హాసన్‌కి హ్యాట్సాప్ చెప్పాలి
- ఈ సినిమాలో ప్రేక్షకులు కొత్తదనాన్ని చూస్తారు
మొట్టమొదటి సారిగా నెగిటివ్ రోల్‌లో నటించానని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. తన 'జై లవకుశ' సినిమా విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... మంచితనం, చెడ్డతనం, హాస్యం మనిషిలోనే ఉండే గుణాలని అన్నాడు. రాక్షసత్వం, ఒంటరితనం, మంచితనం వంటి పాత్రలు జై లవకుశ సినిమాలో కనిపిస్తాయని, అలాంటి పాత్రల్లో తాను నటించానని తెలిపాడు. ఇక మనిషిలోని అన్ని గుణాలు తీసుకుని చేస్తే కనుక తాను ఇప్పుడు కోమాలో ఉండేవాడినేమో అని ఎన్టీఆర్ సరదాగా అన్నాడు.
ఎన్నో పాత్రల్లో నటించే నటుడు కమలహాసన్‌కి హ్యాట్సాప్ చెప్పాలని ఎన్టీఆర్ అన్నాడు. కమలహాసన్ ఓ గొప్పనటుడని అన్నాడు. రామలక్ష్మణులతో పాటు రావణుడు పుట్టడం అనేది ఈ నాటి రామాయణమని వ్యాఖ్యానించాడు. రామలక్ష్మణ, రావణ అనే పాత్రలను స్ఫూర్తిగా తీసుకుని, మనుషుల్లో ఉండే గుణాలని ఈ సినిమాలో చూపించినట్లు చెప్పాడు. తానో మంచి నటుడినని, మహా నటుడినో కాదో సినిమా చూసి చెప్పాలని అన్నాడు. ఈ సినిమాలో ప్రేక్షకులు కొత్తదనాన్ని చూస్తారని చెప్పాడు.