aishwarya rajesh: 'ఎడ్జస్ట్ మెంట్' తనకూ ఎదురైందంటున్న మణిరత్నం హీరోయిన్!

  • ఐదేళ్ల క్రితం అలాంటి పరిస్థితి ఎదురైంది
  • ఇప్పుడైతే ఆ మాట చెప్పేందుకు కూడా భయపడుతున్నారు
  • తప్పు మాట్లాడితే చీల్చి చెండాడే అవకాశం
  • తమిళ హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్

అచ్చ తెలుగమ్మాయి అయినప్పటికీ, తమిళంలో రాణిస్తున్న హీరోయిన్, తాజాగా మణిరత్నం సినిమాలో చాన్స్ కొట్టేసిన ఐశ్వర్యా రాజేష్, ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ, కీలక వ్యాఖ్యలు చేసింది. నటుడు రాజేశ్ కుమార్తెగా 'డాడీ' చిత్రంతో బాలీవుడ్ లోనూ కాలుమోపిన ఐశ్వర్య, ఓ ఐదేళ్ల క్రితం పరిశ్రమలో తానూ లైంగిక వేధింపుల ఇబ్బంది పడ్డానని చెప్పింది. హీరోయిన్లు చెబుతుండే 'ఎడ్జస్ట్ మెంట్' అన్న పదం తనకూ ఎదురైందని, అయితే, ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదని అంది.

ఒకవేళ ఎవరైనా ఆ మాట అంటే, మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో వారిని చీల్చి చెండాడవచ్చని, అందువల్ల అలాంటి మాటలు చెప్పడానికి ఎంతో మంది భయపడుతున్నారని అంటోంది. తనకు హిందీ తెలియకుండానే బాలీవుడ్ కు పరిచయం అయ్యానని, ఇప్పుడు అరవింద్ స్వామి, జ్యోతిక, శింబు వంటి స్టార్స్ తో కలసి మణిరత్నం దర్శకత్వంలో నటించనుండటం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని చెప్పుకొచ్చింది.

aishwarya rajesh
adjustment
maniratnam
  • Loading...

More Telugu News