బుద్ధా వెంకన్న: ప్రధాని పదవిని తృణప్రాయంగా వదులుకున్న ఏకైక నాయకుడు చంద్రబాబు: బుద్ధా వెంకన్న
- వైసీపీ నేతలు అవినీతి పరులు
- చంద్రబాబు నిరంతరం ప్రజా సంక్షేమంపైనే ఆలోచిస్తారు
- వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాల్లో విజయం టీడీపీదే
డేరా బాబా వద్ద దొరికే నిధుల కన్నా ఇడుపుల పాయలో ఎక్కువగా దొరుకుతాయని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వైసీపీ అధినేత జగన్ కు చురకలంటించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... అవినీతికి కేరాఫ్ అడ్రస్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. అటువంటి అవినీతిపరులు చంద్రబాబు నాయుడిని విమర్శించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. నిరంతరం అభివృద్ధి గురించే ఆలోచించే నాయకుడు చంద్రబాబని ఆయన అన్నారు.
ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు. ప్రధాని పదవిని తృణప్రాయంగా వదులుకున్న ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 సీట్లనూ టీడీపీకే అప్పజెప్పి ప్రజలు చంద్రబాబుకు కానుకను ఇస్తారని ఆయన అన్నారు.