palani swamy: దావూద్ ఇబ్రహీంతో కలసి బాంబు పెట్టానంటే మీరు నమ్ముతారా?: దినకరన్


మీడియాపై అన్నాడీఎంకే బహిష్కృత నేత దినకరన్ అసహనం వ్యక్తం చేశారు. తన ప్రత్యర్థులు తనపై ఎన్నో తప్పుడు ఆరోపణలు చేస్తుంటారని... వాటిని నమ్మితే ఎలాగని ప్రశ్నించారు. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతో కలసి తాను కూడా బాంబులు పెట్టానని వారు ఆరోపిస్తే... మీరు నమ్ముతారా? అని అడిగారు. అలాంటి ఆరోపణలను నమ్మనప్పుడు, ఈ ఆరోపణలను కూడా నమ్మరాదని చెప్పారు. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు 19 మంది ఎమ్మెల్యేలను డబ్బుతో కొని, పక్కన పెట్టుకున్నారంటూ పళని వర్గీయులు ఆరోపిస్తున్నారంటూ మీడియా ప్రశ్నించిన నేపథ్యంలో ఆయన పైవిధంగా స్పందించారు.

ఇదే సమయంలో ముఖ్యమంత్రి పళనిస్వామిపై దినకరన్ నిప్పులు చెరిగారు. త్వరలోనే పళనిస్వామిని జైలుకు పంపిస్తానని చెప్పారు. ఆయనపై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయని... వాటిపై విచారణ జరిగితే, జైలుకు వెళతాననే భయం పళనిలో ఉందని అన్నారు. త్వరలో జైలుకు వెళ్లేది తాను కాదని... పళనిస్వామేనని తెలిపారు. 

palani swamy
tamila nadu cm
dinakaran
aiadmk
  • Loading...

More Telugu News