pawan kalyan: నాకు తెలిసి పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి రారు: నటుడు వేణు మాధవ్

  • టీవీ న్యూస్ చానల్ ఇంటర్వ్యూలో వేణు మాధవ్
  • బ్లడ్ ఇస్తా... వారినే చెక్ చేయించుకోమనండి
  • తనకో వ్యాధి ఉందని జరుగుతున్న ప్రచారంపై హాస్య నటుడు

త్వరలోనే తెలుగుదేశం పార్టీ నుంచి పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారాలని భావిస్తున్న హాస్య నటుడు వేణు మాధవ్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. న్యూస్ చానల్ టీవీ 9 నిర్వహించే 'ముఖాముఖి' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, తనకు తెలిసి పవన్ కల్యాణ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రారని అన్నారు. 2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ మద్దతు ఇవ్వకపోయినా, టీడీపీ గెలుస్తుందని భావిస్తున్నారా? అన్న ప్రశ్నకు వేణు మాధవ్ సమాధానం ఇచ్చారు.

ఇంకా ఈ ఇంటర్వ్యూలో 'నంద్యాల ఎన్నికల్లో వైఎస్ జగన్ ను, రోజాను తిట్టడానికి ఎంత డబ్బు తీసుకున్నారు?' అన్న ప్రశ్నకు ఆయన్నుంచి సమాధానం రాబట్టే ప్రయత్నం జరిగింది. 'బయటకు చెప్పుకోవడానికి సిగ్గుపడే వ్యాధితో మీరు బాధపడుతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం. దీనిపై నిజమేంటి?' అన్న ప్రశ్నకు తాను ఎంత బ్లడ్ కావాలంటే అంత బ్లడ్ ఇస్తా, వారినే చెక్ చేయించుకోమనండని వేణు మాధవ్ చెప్పారు. ఈ కార్యక్రమం నేటి రాత్రి ప్రసారం కానుంది.

pawan kalyan
venu madhav
tv9
  • Loading...

More Telugu News