Brian Lara: విండీస్ మాజీ స్టార్ క్రికెటర్ లారాకు గాయాలు.. పదడుగుల పైనుంచి కిందపడ్డ దిగ్గజ ఆటగాడు!


విండీస్ మాజీ దిగ్గజ ఆటగాడు బ్రియాన్ లారా గాయాలపాలయ్యాడు. ఇంటిలోని స్టెయిర్ కేస్ నుంచి కిందపడడంతో అతడి మోకాళ్లు కొట్టుకుపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు.

తొడ, మోకాలు, కాలి మడమకు కట్లతో ఆసుపత్రిలోని బెడ్‌పై పడుకుంటూ అందులో కనిపించాడు. అయితే ప్రమాదంలో పెద్దగా గాయాలు కాలేదని, ఈ విషయంలో దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానని పేర్కొన్నాడు. ఎముకలు ఏవీ విరగలేదని తెలిపాడు. ప్రస్తుతం టీవీ రిమోట్, సెల్‌ఫోన్, పండ్లు, తలగడ (దిండ్లు).. వీటితో కుస్తీపడుతున్నట్టు చమత్కరించాడు. విషయం తెలిసిన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తొందరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

Brian Lara
injuried
cricketer
westindies
  • Loading...

More Telugu News