mahesh babu: ఆ దేవుళ్లను నమ్మినందునే, 'ఒక్కడు', 'అతడు', 'పోకిరి' వచ్చాయి!: మహేష్ బాబు

  • దర్శకుడిని నమ్మే నటుడిని నేను
  • ఒకేసారి రెండు భాషల్లో సినిమా ఈజీ కాదు 
  • చిన్నప్పటి నుంచి సంతోష్ శివన్ సినిమాలు చూసి పెరిగాను 
  • సూర్యలో ఎంతో ఎనర్జీ: మహేష్ బాబు

తాను ఏ దర్శకుడితో సినిమా చేసినా, అతడిని దేవుడిలానే భావిస్తానని, అంతగా నమ్మినందునే ఒక్కడు, అతడు, పోకిరి, శ్రీమంతుడు వంటి హిట్స్ వచ్చాయని ప్రిన్స్ మహేష్ బాబు వ్యాఖ్యానించారు. తాను నటించిన 'స్పైడర్' చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన మహేష్, పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. రెండు భాషల్లో ఒకేసారి ఒక చిత్రం చేయడం అంటే తమాషా కాదని, ఒక షాట్ తెలుగులో, మరో షాట్ తమిళంలో చేస్తూ, ఒక్కో షాట్ ను ఐదారు సార్లు చేసుకుంటూ, పర్ఫెక్ట్ గా సీన్ వచ్చంతవరకూ కష్టపడ్డామని అన్నాడు.

ఎంతో గొప్ప డైరెక్టర్ అయితే తప్ప అంత ఎనర్జీ, సెట్ మెయిన్ టెనెన్స్ కుదరవని, మురుగదాస్ లో ఆ లక్షణాలన్నీ ఉన్నాయని అన్నాడు. తాను చిన్నతనంలో సంతోష్ శివన్ సినిమాలు చూస్తూ పెరిగానని, ఆయనతో పని చేయాలన్న తన కోరిక ఇన్నాల్టికి తీరిందని అన్నాడు. తనకు ఎనర్జీ డ్రాప్ అయినా, సూర్యకు ఎన్నడూ అలా జరగలేదని, ఆయన ఎప్పుడూ నవ్వుతూనే కనిపించేవారని చెప్పుకొచ్చాడు. కొన్ని సన్నివేశాల కోసం 25 రోజుల పాటు ఎంతో శ్రమించి 2 వేల మంది ఆర్టిస్టులతో పనిచేశామని, ఆ సమయం షూటింగ్ లో అత్యంత క్లిష్టమైన సమయమని అన్నారు.

mahesh babu
sj surya
spyder
murugadas
  • Loading...

More Telugu News