: నటుడు, దర్శకుడు సూర్య వేదికపై తన గురించి మాట్లాడగానే మురిసిపోయిన మహేశ్ బాబు కూతురు!


‘ఎస్పీవై.. ర‌య్ ర‌య్ ర‌య్..’ అంటూ ‘స్పైడ‌ర్’ సినిమాలో టైటిల్ సాంగ్ కు అనుగుణంగా త‌న పెదాలు క‌దిలిస్తూ ఓ కారులో మ‌హేశ్ బాబు కూతురు సితార పాడిన పాట వైర‌ల్ అయిన విష‌యం తెలిసిందే. ఈ రోజు స్పైడ‌ర్ సినిమా న‌టుడు సూర్య  ‘స్పైడ‌ర్ ప్రీ  రిలీజ్ ఈవెంట్‌’లో వేదికపై మాట్లాడుతూ ఆ వీడియోను గుర్తు చేశాడు. మహేశ్ బాబు కూతురి వీడియోను చూశానని, అది త‌న‌కు ఎంతగానో నచ్చిందని అన్నాడు. స్పైడ‌ర్ అన్ని ఈవెంట్ల‌లోనూ త‌న‌కు ఆ వీడియోనే న‌చ్చింద‌ని చెప్పాడు. ఆయ‌న మాట‌లు విన్న మ‌హేశ్ బాబు కూతురు సితార మురిసిపోతూ చిరున‌వ్వులు చిందించింది.

కాగా, మ‌హేశ్ బాబు ఇంత‌వ‌ర‌కు సాధించిన రికార్డుల‌న్నింటినీ స్పైడ‌ర్‌ అధిగ‌మిస్తుందని సూర్య అన్నాడు. మురుగ‌దాస్ నిబద్ధ‌త‌తో ప‌నిచేస్తాడ‌ని అన్నాడు. అక్క‌డ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీ కాంత్ అయితే, ఇక్క‌డ మ‌హేశ్ బాబు అని వ్యాఖ్యానించాడు. త‌మిళ‌నాడులోనూ ఈ సినిమాపై ఎన్నో ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయని చెప్పాడు. ఈ సినిమాలో అంద‌రూ బాగా న‌టించార‌ని అన్నాడు.

త‌మిళ‌నాడులో లైకా కంపెనీ ఈ మూవీని విడుద‌ల చేస్తోంద‌ని చెప్పాడు. ‘జ‌నాభాని కంట్రోల్ చేసేందుకు సునామీ, భూకంపంలా నేనూ ఒక భాగ‌మే’ అంటూ స్పైడ‌ర్ సినిమాలో తాను చెప్పిన డైలాగుని చెప్పాడు. ఈ ఈవెంట్‌కి ‘స్పైడర్’ సంగీత దర్శకుడు హేరిస్ జ‌య‌రాజ్ హాజ‌రుకాలేక‌పోయాడు.

  • Loading...

More Telugu News