: నా కెరీర్లోనే బిగ్గెస్ట్ సినిమా ‘స్పైడర్’: హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్
తనకు ‘స్పైడర్’ లాంటి సినిమాలో నటించే అవకాశం ఇచ్చినందుకు దర్శకుడు మురుగదాస్‌కి కృతజ్ఙతలు తెలుపుతున్నట్లు నటి రకుల్ ప్రీత్ సింగ్ వ్యాఖ్యానించింది. ఈ రోజు హైదరాబాద్‌లో జరుగుతోన్న ‘స్పైడర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆమె మాట్లాడుతూ... తాను టాలీవుడ్లోకి ఎంట్రీ అయినప్పుడు మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరని అడిగారని, తాను అన్ని సందర్భాల్లోనూ మురుగదాస్ పేరు చెబుతూ వస్తున్నానని చెప్పింది.
అలాగే, సూపర్ స్టార్ మహేశ్ బాబుతో నటించే అవకాశం వచ్చినందుకు రకుల్ ప్రీత్ సింగ్ హర్షం వ్యక్తం చేసింది. మహేశ్ ఇంత పెద్ద స్టార్ అయినప్పటికీ ఎంతో వినమ్రతతో ఉంటాడని తెలిపింది. ఈ సినిమా స్క్రిప్ట్ వినకముందే ఈ సినిమా చేయాలని తాను ఆరాటపడ్డానని తెలిపింది. స్పైడర్ ఓ పెద్ద హిట్ అవుతుందని వ్యాఖ్యానించింది.