: పోటీపడి డ్యాన్స్ చేస్తోన్న ఎన్టీఆర్, తమన్నా.. ‘స్వింగ్ జరా’ సాంగ్ వీడియో విడుదల


‘నేనో గ్లామ‌ర్ బండి.. వ‌చ్చేశా స్వ‌ర్గం నుండీ.. స్వింగ్ జ‌రా స్వింగ్ జ‌రా స్వింగ్ జరా స్వింగ్‌.. అందం తిన్నానండీ అందుకే ఇట్టా ఉన్నానండీ’ అంటూ జై ల‌వ‌కుశ సినిమాలో త‌మ‌న్నా చేస్తోన్న డ్యాన్స్ అదుర్స్ అనిపిస్తోంది. ఈ పాట‌లోని త‌మ‌న్నా లుక్‌ను తాజాగా ఎన్టీఆర్ ఆర్ట్స్ విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు 44 సెక‌న్ల నిడివితో ఆ పాట వీడియోను కూడా విడుద‌ల చేసింది. త‌మ‌న్నా, ఎన్టీఆర్‌లు పోటీ ప‌డుతున్న‌ట్లు చేసేస్తోన్న డ్యాన్స్ అభిమానుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ఈ సినిమాను ఈ నెల 21న విడుద‌ల చేయ‌నున్నారు. మూడు పాత్ర‌ల్లో ఎన్టీఆర్ న‌టిస్తుండ‌డంతో ఈ సినిమాపై అభిమానులు అమిత‌మైన ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు.

  • Loading...

More Telugu News