: లండన్ అండర్ గ్రౌండ్ మెట్రో రైల్లో భారీ పేలుడు!

  • ఉలిక్కి పడ్డ లండన్
  • పేలుడులో పలువురికి గాయాలు
  • ఘటనా స్థలిని అధీనంలోకి తీసుకున్న స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు
  • నిలిచిపోయిన మెట్రో రైల్ రాకపోకలు

భారీ పేలుడుతో లండన్ నగరం ఉలిక్కి పడింది. నగరంలోని అండర్ గ్రౌండ్ మెట్రో ట్రైన్ (ట్యూబ్)లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. లండన్ కాలమానం ప్రకారం ఉదయం 8.30 గంటలకు ఈ పేలుడు సంభవించింది. వెస్ట్ లండన్ లోని పార్సన్స్ గ్రీన్ స్టేషన్ లో ఈ పేలుడు జరిగింది. ఓ సీటు కింద ఉంచిన తెల్లటి కంటెయినర్ లో ఈ పేలుడు పదార్థాన్ని అమర్చినట్టు సమాచారం. ఈ పేలుడు వల్ల చాలా మంది ప్రయాణికుల ముఖాలకు గాయాలయ్యాయి. ప్రాణ నష్టం సంభవించలేదని తెలుస్తోంది. పేలుడు జరిగిన వెంటనే బ్రిటీష్ ట్రాన్స్ పోర్ట్ పోలీస్, ఫైర్ సిబ్బంది, స్కాట్లాండ్ యార్ట్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని, ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు.

జరిగిన ఘటనతో ప్రయాణికులు షాక్ కు గురయ్యారు. కొంత మంది కంట్రోల్ చేసుకోలేక, ఏడుస్తూ కనిపించారని పోలీసులు తెలిపారు. రైల్లోని ప్రయాణికులను వెనకవైపు ఉన్న గేట్ ద్వారా సురక్షితంగా బయటకు పంపేశారు. రైళ్ల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ఇది ఉగ్రదాడే అయి ఉంటుందని ఇప్పటికిప్పుడే చెప్పలేమని అధికారులు తెలిపారు.  

  • Loading...

More Telugu News