: బలవంతంగా పార్టీని పెడుతున్నా... ఇష్టపడి కాదు: కమలహాసన్ సంచలన వ్యాఖ్య

  • ప్రజలు బలవంతం చేశారు
  • నా ఐడియాలజీతో సరితూగే పార్టీలు లేవు
  • అందువల్లే కొత్త పార్టీ దిశగా అడుగులు
  • బీజేపీతో జట్టు కట్టేది లేదని స్పష్టం చేసిన కమల్

త్వరలోనే సొంత పార్టీని పెట్టి రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నానని స్పష్టం చేసిన దక్షిణాది విలక్షణ నటుడు కమలహాసన్, ఓ ఇంటర్వ్యూ ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఇష్టపడి రాజకీయాల్లోకి రావడం లేదని అన్నారు. ప్రజలు తనను రాజకీయాల్లోకి రావాలని బలవంత పెట్టారని, అందువల్లే పార్టీ పెడుతున్నానని చెప్పారు. తను మనఃపూర్వకంగా ఈ నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. తనకున్న ఐడియాలజీతో సరిపోయే రాజకీయ పార్టీలు తమిళనాడులో లేవని, అందుకే కొత్త పార్టీ వైపు అడుగులు వేస్తున్నానని అన్నారు. శశికళను అన్నాడీఎంకే నుంచి తప్పించడాన్ని స్వాగతించిన ఆయన, తమిళ రాజకీయాల్లో మార్పు వస్తోందనడానికి ఈ నిర్ణయం ఓ సాక్ష్యమని చెప్పారు. బీజేపీతో తాను సంబంధం పెట్టుకోనున్నట్టు వస్తున్న వార్తలనూ కమల్ ఖండించారు.

  • Loading...

More Telugu News