: రాజకీయాల్లోకి హీరోయిన్ అంజలి?
* పాలిటిక్స్ లోకి అంజలి ఎంట్రీ అంటూ వార్తలు
* మూడు పార్టీల నేతలతో చర్చలు
* ఇంకా వివరణ ఇవ్వని రాజోలు బ్యూటీ
టాలీవుడ్, కోలీవుడ్ లో తనదైన శైలిలో సినీ అభిమానులను మెప్పిస్తున్న రాజోలు బ్యూటీ అంజలి రాజకీయాల్లోకి రాబోతోందనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే, ఆమె ప్రాంతీయ పార్టీలో చేరుతుందో, లేక జాతీయ పార్టీలో చేరుతుందో అనే విషయంలో క్లారిటీ లేదు. ఇటీవలే ఆమె రెండు, మూడు పార్టీల నేతలను కలసి, చర్చలు జరిపిందట. దీంతోనే, ఆమె రాజకీయాల్లోకి వస్తోందనే వార్తలు బయలుదేరాయి. అయితే, ఇంత వరకు ఈ వార్తలపై అంజలి కాని, ఆమె సన్నిహితులు కానీ స్పందించలేదు. మరోవైపు, ఆమె పొలిటికల్ ఎంట్రీ ఖాయమని మరికొందరు గట్టిగా చెబుతున్నారు.