: కోట్లు విలువ చేసే శీతల పానీయం ప్రకటనను తిరస్కరించిన విరాట్ కోహ్లీ!
క్రికెటర్లు, సినిమా తారలు ఉపయోగించే వస్తువులను వాడేందుకు అభిమానులు ఆసక్తి చూపిస్తారు. ఈ విషయాన్నే దశాబ్దాల నుంచి వాణిజ్య వ్యాపార కంపెనీలు సొమ్ము చేసుకుంటున్నాయి. సెలబ్రిటీలకు కోట్లు ముట్టజెప్పి తమ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకుంటున్నాయి.
ఈ నేపథ్యంలోనే క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీకి ఓ పేరున్న శీతల పానీయం ప్రకటన చేసే అవకాశం వచ్చింది. అయితే విరాట్ ఈ అవకాశాన్ని తిరస్కరించాడట. శరీర దారుఢ్యానికి అధిక ప్రాధాన్యతనిచ్చే తాను.. శీతల పానీయాలను ఉపయోగించనని, అందుకే అలాంటి ఉత్పత్తులను తయారు చేసే కంపెనీలకు తాను ప్రకటనలను చేయబోనని విరాట్ తెలిపినట్లు తెలుస్తోంది. అభిమానులను తప్పుదోవ పట్టించడం ఇష్టం లేక, కోట్ల రూపాయల విలువైన ప్రకటన చేసే అవకాశాన్ని వదులుకున్న విరాట్ వ్యక్తిత్వాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు.