: ఐఎస్ఐఎస్ మరో నరమేధం... 74 మంది దుర్మరణం

* ఇరాక్ రెస్టారెంట్ పై విచక్షణారహితంగా దాడి

* 74 మంది మృతి

* 91 మందికి గాయాలు

* పలువురి పరిస్థితి విషమం


ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ ఇరాక్ పై మరోసారి పంజా విసిరింది. దిఖర్ ప్రావిన్స్ పరిధిలోని నసీరియా పట్టణంలోని ఓ రెస్టారెంటుపై ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపి, ఆపై అక్కడికి దగ్గరలోనే ఉన్న చెక్ పోస్టుపై ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 74 మంది మృతిచెందగా, మరో 91 మంది గాయపడ్డారు. ఘటనా స్థలిలో పరిస్థితి భీతావహంగా ఉందని, గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించామని, వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. కాగా, భద్రతా బలగాలతో కలసి ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడుతున్న షియా సంస్థ 'హషీద్ అల్ షాబి' సభ్యుల రూపంలో వచ్చిన ముష్కరులు ఈ దారుణానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. కాగా, ఇస్లాంకు వ్యతిరేకంగా నడుస్తున్న ఇరాక్ పై ఈ దాడికి పాల్పడింది తామేనని ఐఎస్ఐఎస్ వెల్లడించింది.

  • Loading...

More Telugu News