: కూచిభొట్ల శ్రీనివాస్ భార్య సునయనకు వీసా మంజూరు.. సాయం చేసిన అమెరికా చట్ట సభ్యుడు
ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికాలోని కన్సాస్‌లో ఉన్మాది ఘాతుకానికి బలైన సాఫ్ట్వేర్ ఇంజినీర్ కూచిభొట్ల శ్రీనివాస్ భార్య సునయనకు అమెరికా తాత్కాలిక వర్క్ వీసా మంజూరైంది. భర్త మరణంతో సునయన అమెరికాలో నివసించే హక్కును కోల్పోయింది. దీంతో ఆమెకు అక్కడి చట్ట సభ్యుడు, రిపబ్లికన్ పార్టీ నేత కెవిన్ యోడర్ అండగా నిలిచి వీసా మంజూరీలో సాయం చేశారు. దీంతో సునయనకు తాత్కాలిక వర్క్ వీసా మంజూరైంది. తనకు వీసా వచ్చేందుకు కృషి చేసిన యోడర్కు సునయన కృతజ్ఞతలు తెలిపారు.
కన్సాస్‌లో జీపీఎస్ వ్యవస్థలను తయారుచేసే గార్నిమ్ సంస్థలో పనిచేసే శ్రీనివాస్‌ను ఫిబ్రవరిలో ఆడమ్ ప్యురింటన్ అనే ఉన్మాది కాల్చి చంపాడు. శ్రీనివాస్ అంత్యక్రియల కోసం భారత్ వచ్చిన ఆయన భార్య సునయన భర్త మరణంతో తిరిగి అమెరికా వెళ్లే అవకాశాన్ని కోల్పోయారు. సునయనకు జరిగిన అన్యాయాన్ని తీవ్రంగా పరిగణించిన కెవిన్ యోడర్ ఆమెకు వీసా ఇప్పించేందుకు సాయపడ్డారు. భర్త మరణించాడని చెప్పి ఆమె వీసాను రద్దు చేయడం తనను బాధించిందన్నారు.