: పుణె నుంచి హైదరాబాద్ వస్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం.. పారిపోయిన డ్రైవర్, క్లీనర్


పుణె నుంచి హైదరాబాద్ వస్తున్న ఆరెంజ్ ట్రావెల్ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. మితిమీరిన వేగంతో వస్తున్న బస్సు షోలాపూర్-బీదర్ మధ్య అదుపు తప్పి డివైడర్ ను ఢీకొంది. దీంతో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సును వదిలేసి డ్రైవర్, క్లీనర్ పరారయ్యారు. దీంతో ప్రయాణికుల అవస్థలు చెప్పనలవి కాకుండా పోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. ప్రయాణికులు మధ్యలోనే చిక్కుకుపోవడంతో మరో వాహనం ద్వారా వారిని హైదరాబాద్ పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News