: ఓవైపు కేసీఆర్ ను తిడుతూనే.. మరోవైపు టీఆర్ఎస్ లో చేరే ప్రయత్నం చేస్తున్నారు: గుత్తా సుఖేందర్ రెడ్డి
కోమటిరెడ్డి సోదరులు వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డిలపై నల్గొండ టీఆర్ఎస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. వీరిద్దరూ మతిస్థిమితం లేకుండా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఓవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ ను తిడుతుంటారని, మరోవైపు టీఆర్ఎస్ పార్టీలోకే వచ్చే ప్రయత్నాలు చేస్తుంటారని అన్నారు. నల్గొండలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసే హక్కు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి లేదని చెప్పారు. ప్రతి జిల్లాకు ఓ మెడికల్ కాలేజీ కేటాయించే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని... ఎలాగూ మెడికల్ కాలేజీ వస్తుందని తెలిసే, దొంగ దీక్షలకు దిగుతున్నారని ఎద్దేవా చేశారు.