: మెగా హీరో ఇంట్లో ‘కబాలి’, ‘క్రిష్‌’, ‘బాహుబలి’ బొమ్మ‌లు.. మీరూ చూడండి!


కొత్త క‌థ‌తో ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన‌ ‘బాహుబలి’ సినిమాకు అభిమానుల నుంచి ఎంత‌గా స్పంద‌న వ‌చ్చిందో అంద‌రికీ తెలిసిందే. అలాగే, సౌతిండియా సూప‌ర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘క‌బాలి’, బాలీవుడ్ హీరో హృతిక్ రోష‌న్ న‌టించిన ‘క్రిష్’ సినిమాలు అంత‌గా హిట్ కాక‌పోయినా ఆయా సినిమాల్లో ఆ హీరోల‌ వేష‌ధార‌ణకు ఎన‌లేని పాప్యులారిటీ వ‌చ్చింది. చిన్నారుల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు బాహుబ‌లి, క్రిష్ బొమ్మ‌ల‌పై ఎంతో ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. అలాంటి వారిలో నటుడు అల్లు శిరీష్ కూడా ఉన్నాడు.

అల్లు శిరీష్ ఇంట్లోకి వెళ్లి చూస్తే రజనీకాంత్, హృతిక్‌ రోషన్‌, ప్రభాస్‌ ల ‘కబాలి’, ‘క్రిష్‌’, ‘బాహుబలి’ బొమ్మ‌లు ఉంటాయి. త‌న‌ డెస్క్‌ మీద వీరి బొమ్మ‌లు ఉంటాయ‌ని అల్లు శిరీష్ ట్వీట్‌ చేశాడు. ‘శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు’ సినిమాతో మంచి హిట్ కొట్టిన అల్లు శిరీష్ ప్రస్తుతం ఆనంద్‌ దర్శకత్వంలో చ‌క్రి నిర్మిస్తోన్న‌ ఓ సినిమాలో నటిస్తున్నాడు.  

  • Loading...

More Telugu News