: తెలివిగా విమర్శించడంలో సుష్మా తర్వాతే ఎవరైనా!.... పొగిడేస్తున్న నెటిజన్లు!
`విమర్శలకు తెలివిగా సమాధానం ఇవ్వడంలో ఆమె తర్వాతే ఎవరైనా` అని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ను నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు. ఒక చిన్న లైక్ ద్వారా విమర్శించడం ఆమెకు మాత్రమే సాధ్యమని సుష్మా నిరూపించుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే... ఇటీవల యెమెన్ తీవ్రవాదుల చెర నుంచి ఫాదర్ టామ్‌ను భారత, ఒమన్ ప్రభుత్వాలు కాపాడిన సంగతి తెలిసిందే. ఇదే విషయంపై గతంలో `ఫాదర్ టామ్‌ను ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు ఉరి తీసినా భారత ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎందుకంటే అతను క్రైస్తవుడు కాబట్టి!` అని కాంగ్రెస్ నేత మనీష్ తివారీ ట్వీట్ చేశారు.
ఫాదర్ టామ్‌ను సురక్షితంగా రక్షించిన తర్వాత మనీష్ తివారీ ట్వీట్‌ను సుష్మా లైక్ చేశారు. ఆమె చేసిన లైక్ వల్ల ఇప్పుడు మనీష్ తివారీ ట్వీట్ ట్విట్టర్‌లో ట్రెండింగ్‌గా మారింది. రీట్వీట్ చేయడంపై మనీష్ కూడా తెలివిగా స్పందించారు. `నా ట్వీట్‌ను లైక్ చేయడం కంటే గొప్ప పనులు మీరు చేయాల్సింది సుష్మాజీ!` అంటూ ఒమన్ ప్రభుత్వం విడుదల చేసిన ఓ ప్రెస్‌నోట్‌ను ట్యాగ్ చేశారు. అందులో ఫాదర్ టామ్‌ను తాము మాత్రమే కాపాడినట్లు, భారత్ ప్రస్తావన లేకుండా ఒమన్ ప్రభుత్వం ప్రకటించింది.