: న‌వంబ‌ర్ 27న ఒక్క‌టి కాబోతున్న జ‌హీర్‌, సాగ‌రిక‌!


భార‌త క్రికెట‌ర్ జ‌హీర్ ఖాన్‌, చ‌క్ దే ఇండియా న‌టి సాగ‌రిక ఘ‌ట్కే న‌వంబ‌ర్ 27న వివాహం చేసుకోబోతున్న‌ట్లు స‌మాచారం. మే నెల‌లో వీరిద్ద‌రికీ నిశ్చితార్థం జరిగిన సంగ‌తి తెలిసిందే. జ‌హీరే ముందు త‌న‌కు ప్ర‌పోజ్ చేశాడ‌ని సాగ‌రిక ఓ ఇంట‌ర్వ్యూలో కూడా తెలిపింది. యువ‌రాజ్ సింగ్‌, హ‌జ‌ల్ కీచ్ వివాహ వేడుక‌కు వీరిద్ద‌రూ జంట‌గా హాజ‌ర‌య్యారు. త‌ర్వాత పుకార్లు రాకుండా ఉండేందుకు వారిద్ద‌రి మ‌ధ్య ప్రేమ వ్య‌వ‌హారం న‌డుస్తున్న‌ట్లు జ‌హీర్ ప్ర‌క‌టించారు. త‌ర్వాత ఈ ప్రేమ జంట‌కు సంబంధించిన ఫొటోల‌ను ఇద్ద‌రూ త‌మ సోష‌ల్ మీడియా అకౌంట్ల‌లో కూడా పోస్ట్ చేశారు. ఏదేమైనా మ‌రో సినీ తార - క్రికెట‌ర్ వివాహం స్ప‌ష్టం కావ‌డంతో అభిమానులు ఆనందంతో పొంగిపోతున్నారు. త్వ‌ర‌లో విరాట్ - అనుష్క‌లు కూడా ఇలాగే ఒక్క‌టైతే ఇంకా బాగుంటుంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు.

  • Loading...

More Telugu News