: నా బర్త్ డేకి నేరుగా వచ్చి శుభాకాంక్షలు చెప్పండి.. చాలు!: సినీ నటుడు ఉపేంద్ర


హీరో కిచ్చ సుదీప్ ఇటీవలే తన బర్త్ డే ను చాలా నిరాడంబరంగా జరుపుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఎటువంటి దుబారా ఖర్చు చేయవద్దని, ఆ సొమ్మును పేదల సాయానికి ఉపయోగించాలని కోరారు. అదే పద్ధతిలో హీరో ఉపేంద్ర కూడా పయనించనున్నాడు. ఈ నెల 18న ఉపేంద్ర పుట్టినరోజు జరుపుకోనున్నాడు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు కేక్ లు కట్ చేయడం, తన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, పూలదండలు వేయడం వంటివి చేయడం ద్వారా అనవసర ఖర్చు చేయవద్దని ఈ సందర్భంగా ఉపేంద్ర సూచించారు. అభిమానులు నేరుగా తన ఇంటికే వచ్చి బర్త్ డే శుభాకాంక్షలు చెప్పాలని ఉపేంద్ర చెప్పాడు. దీంతో, తమ అభిమాన హీరోను దగ్గరగా చూసే అవకాశం లభించనుండంటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

  • Loading...

More Telugu News