: స్వాతి లక్రాకు ప్రతిష్టాత్మక ‘హంఫ్రీ లీడర్ షిప్’ అవార్డు!


హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ (నేర పరిశోధన) స్వాతి లక్రాకు అరుదైన పురస్కారం లభించింది. దేశ విదేశాల్లో వినూత్న తరహాలో సామాజిక సేవలందిస్తూ నాయకత్వ లక్షణాలు ప్రదర్శిస్తున్న వారిని గుర్తించి అమెరికన్ కాన్సులేట్ ఇచ్చే ‘హంఫ్రీ లీడర్ షిప్ అవార్డు’ ఆమెకు లభించింది. అమెరికాలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సహకారంతో ఆ దేశ విద్యా, సాంస్కృతిక శాఖ ఈ అవార్డును అందజేస్తుంది.

ఈ ఏడాది శాంతి భద్రతలు, మానవహక్కుల పరిరక్షణ అంశంపై ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ రంగాల్లో కృషి చేస్తున్న వ్యక్తులు, సంస్థలను అమెరికన్ కాన్సులేట్ ప్రతినిధులు పరిగణనలోకి తీసుకోగా, భారత్ నుంచి ఎంపికైన వారిలో స్వాతి లక్రా ఒకరు. కాగా, అవార్డు అందుకునే నిమిత్తం ఆమె నిన్న అమెరికాకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా స్వాతి లక్రా మాట్లాడుతూ, ఈ అవార్డుకు తాను ఎన్నికైన విషయంపై నెలరోజుల క్రితం సమాచారం అందిందని, ఈ అవార్డు పోలీస్ శాఖకు, వ్యక్తిగతంగా తనకు అత్యంత గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పారు. భరోసా, ‘షి’ బృందాల ద్వారా హైదరాబాద్ పోలీస్ చేస్తున్న కృషికి గుర్తింపుగానే ఈ అవార్డు తనకు వచ్చిందని అనుకుంటున్నట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News