: జైల్లో శశికళకు అన్ని సదుపాయాలు కల్పించామన్న వార్తల్లో నిజంలేదు: కర్ణాటక హోంమంత్రి
అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తోన్న శశికళ.. అందులో రాజభోగాలు అనుభవిస్తున్నారని మరోసారి వార్తలు గుప్పుమన్న విషయం తెలిసిందే. ఆ వార్తలపై స్పందించిన కర్ణాటక హోంమంత్రి రామలింగారెడ్డి... ఆమెను సాధారణ ఖైదీగానే చూస్తున్నారని చెప్పారు. శశికళకు, ఆమె బంధువు ఇళవరసికి జైలులో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారని వస్తోన్న వార్తల్లో నిజం లేదని అన్నారు. తాను స్వయంగా తన కళ్లతో చూసిన తరువాత ఈ విషయాన్ని చెబుతున్నానని వ్యాఖ్యానించారు. అలాగే జైలులో శశికళకు ఎలాంటి పని అప్పగించారన్న విషయం తనకు తెలియదని అన్నారు. ఈ విషయంలో కోర్టు ఉత్తర్వుల మేరకు ఆమెకు పనులు కేటాయిస్తారని తెలిపారు.