: కంచ ఐలయ్యను కేసీఆర్ ప్రభుత్వం చట్టబద్ధంగా శిక్షించాలి: సోము వీర్రాజు


మాజీ ప్రొఫెసర్ కంచ ఐలయ్య జాతి వ్యతిరేక శక్తి అని, ఆయన్ని కేసీఆర్ ప్రభుత్వం చట్టబద్ధంగా శిక్షించాలని బీజేపీ ఎమ్మెల్యే సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కంచ ఐలయ్య విషయంలో కేసీఆర్ సోయి లేకుండా వ్యవహరిస్తున్నారని, తనను ఐలయ్య దూషిస్తే కేసీఆర్ చూస్తూ ఊరుకునేవారా? అని ప్రశ్నించారు. ఏపీలో 175 నియోజకవర్గాల్లో బీజేపీని బలోపేతం చేస్తామని, ‘మోదీ మాట- చంద్రన్న బాట’ ద్వారా పథకాలు ప్రజల్లోకి వెళ్తున్నాయని, అక్టోబర్ లో అమిత్ షా విజయవాడలో పర్యటించనున్నారని చెప్పారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు సేవా దివస్ నిర్వహిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News